అక్షరటుడే, ఇందూరు : BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Nara Sudhakar) డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో గురువారం మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కోఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు రోజుకోవిధంగా నిరసన తెలుపుతున్నామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తుచేశారు. రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేశాకే పంచాయతీ ఎలక్షన్ (Panchayat Election) నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు దేవేందర్, శంకర్, రవీందర్, సాయి, అజయ్, శ్రీలత, చంద్రకాంత్, బాలన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
