అక్షరటుడే, కామారెడ్డి : CMRF Checks | అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నవారికి సీఎం సహాయ నిధి ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.30లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) చెక్కులను గురువారం బాధిత కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆస్పత్రి బిల్లుతో (Hospital Bill) తమను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. పేదలకు సహాయంగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటానన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) పాల్గొన్నారు.
Shabbir Ali | నిజామాబాద్ నగరంలో..
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి చెందిన 26 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రూ.18లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను (CMRF cheques) అందజేసినట్లు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం బాధితులు తమను సంప్రదిస్తే సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామని ఆయన హామీఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

