అక్షరటుడే, వెబ్డెస్క్ : Adilabad Police | సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంలో రీల్స్ చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ (Adilabad)లో చోటు చేసుకుంది.
సోషల్ మీడియా (Social Media) పిచ్చితో యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రీల్స్ కోసం ప్రమాకర స్టంట్లు చేయడంతో పాటు చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల వాహనంతో ఇద్దరు యువకులు రీల్స్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. దీంతో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు (Adilabad One Town Police) కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Adilabad Police | వాహనం ఎక్కడిది..
పోలీస్ పెట్రోలింగ్ వాహనం (Police Patrol Vehicle)లో రీల్స్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారిక వాహనంలో రీల్స్ చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ యువకులకు పోలీస్ వాహనం ఎక్కడిది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులకు తెలియకుండా వాహనం ఎత్తుకెళ్లి రీల్స్ చేశారా.. లేదంటే శాఖలోని ఎవరైనా వాహనం ఇచ్చారా అనేది తెలియరాలేదు. ఒకవేళ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని తెలియకుండా తీసుకు వెళ్లి రీల్స్ చేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
