అక్షరటుడే, ఇందూరు: Ramakrishna Seva Samiti | స్వామి వివేకానంద (Swami Vivekananda) సూక్తులను అలవర్చుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని డీఈవో అశోక్ (Deo Ashok) అన్నారు. రామకృష్ణ సేవా సమితి (Ramakrishna Seva Samiti) ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్షణతో పాటు రామకృష్ణుడు, శారదా మాత సూక్తులను మంచి నడవడికని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం స్వామి తపతానంద రామకృష్ణ (Swami Tapatananda Ramakrishna) మాట్లాడుతూ.. యోగా (Yoga), డ్రాయింగ్ (Drawing), కరాటే, మ్యూజిక్, వేదిక్ మ్యాథ్స్, నాట్యం తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారన్నారు. అనంతరం రెడ్‌క్రాస్ జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్ (Red Cross Society)ను సన్మానించారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం (Ramakrishna Matam) రాష్ట్ర మాజీ కన్వీనర్ సూర్య ప్రకాష్, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు సాయి ప్రసాద్, ఉపాధ్యక్షుడు యోగా రామచంద్ర, కార్యదర్శి గోపాల్, వ్యవస్థాపక కార్యదర్శి తోట రాజశేఖర్, యువ విభాగ కన్వీనర్ వసంత్ పాటిల్, సభ్యులు దీపక్ నాయక్, వినోద్, స్వరూప్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.