అక్షరటుడే, వెబ్డెస్క్: Rajamouli | రాజమౌళి సినిమాలను ఆపేస్తామని విశ్వహిందు పరిషత్ నాయకులు (Vishwa Hindu Parishad leaders) హెచ్చరించారు. ఇటీవల వారణాసి సినిమా ఈవెంట్లో (Varanasi film event) ఆయన మాట్లాడుతూ.. తనకు హనుమంతుడిపై నమ్మకం లేదని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. రాజమౌళి (Rajamouli) క్షమాపణ చెప్పాలని హిందు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వానర సేన ఆధ్వర్యంలో ఇప్పటికే రాజమౌళిపై కేసులు పెట్టారు. తాజాగా వీహెచ్పీ నాయకులు సైతం డైరెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని హెచ్చరించారు. రాముడు, హనుమంతుడు (Ram and Hanuman) దేవుళ్లలా కనిపించలేదా అని వీహెచ్పీ నాయకుడు తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను ధర్మద్రోహంగా భావిస్తున్నామన్నారు.
Rajamouli | సినిమాలను బహిష్కరించాలి : రాజాసింగ్
రాజమౌళి వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Gosha Mahal MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులందరూ రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని సూచించారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి రూ.కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారని ప్రశ్నించారు. ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా రాజమౌళి ఇలాంటి మాటలే మాట్లాడారన్నారు. రాముడు, కృష్ణుడిపై వ్యాఖ్యలు చేశారని మండి పడ్డారు. ఇలాంటి వారు తీసిన సినిమాలను హిందువులు చూడొద్దని కోరారు. ఇలాంటి వేస్ట్ డైరెక్టర్లపై ఫిర్యాదులు చేయాలన్నారు.
