Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. గత కొన్ని రోజులు వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంటలు సాగు చేసిన రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం, సాయంత్రం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. గత కొన్ని రోజులు వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంటలు సాగు చేసిన రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.

దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం, సాయంత్రం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో చెదురుమదురు వానలు పడతాయి. రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్​ నగరంలో సైతం రాత్రి పూట భారీ వర్షం పడుతుంది. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది.

Weather Updates | దంచికొట్టిన వాన

యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ, వరంగల్​ రూరల్​, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా నాగారంలో 70మి.మీ, యాదాద్రిలోని రమ్మనపేటలో 51మి.మీ వర్షాపాతం నమోదైంది. వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.