3
అక్షరటుడే, బిచ్కుంద: Government Degree College| మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో (Autonomous) నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. ఈ మేరకు దోస్త్ (DOST) కో–ఆర్డినేటర్ డాక్టర్ జి వెంకటేశం ఆధ్వర్యంలో మంగళవారం అధ్యాపకులు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం, బీర్కూర్, కంగ్టి గ్రామాల్లో తిరుగుతూ, ఇంటర్ విద్యార్థులను డిగ్రీ కళాశాలలో చేరాలని కోరారు. కళాశాలలో అందిస్తున్న కోర్సులు, ఉపకార వేతనాల గురించి వివరించారు.