అక్షరటుడే, వెబ్డెస్క్: NIRDPR jobs | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR)లో ఒప్పంద ప్రాతిపదికన(Contract Basis) వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గలవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్టుల సంఖ్య : 4 (ప్రాజెక్ట్ మేనేజర్ -1, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ -2, థిమాటిక్ ఎక్స్‌పర్ట్ -1.)
అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, ఎంటెక్/ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అవసరం.
వయోపరిమితి : 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
వేతనం : నెలకు రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు..
దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము : జనరల్(General), ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 300(చార్జీలు అదనం) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు గడువు : జనవరి 22.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు https://career.nirdpr.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.