అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Trains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) వందే భారత్ సహా 11 కొత్త రైళ్లను ఈ నెల 17 ప్రారంభించనున్నారు. వాటిలో ఎక్కువగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉండటం గమనార్హం.
ప్రధాని ఈ నెల 17న అస్సాం రాష్ట్రంలోని మాల్డా టౌన్ నుంచి 8 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక వందే భారత్ (Vande Bharat), రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా రైళ్లు సంబంధిత స్టేషన్లకు చేరుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి ప్రవేశపెట్టనున్న కొత్త రైళ్లలో 8 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, ఒక వందే భారత్ స్లీపర్ రైలు, 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
New Trains | అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలు
న్యూ జల్పాయిగురి – తిరుచ్చిరాపల్లి వీక్లీ (వయా విశాఖపట్నం – విజయవాడ – గూడూరు), ఎస్.ఎం.వి.టి బెంగళూరు – అలీపుర్దూర్ (పశ్చిమ బెంగాల్ ) వీక్లీ (వయా రేణిగుంట – గూడూరు – విజయవాడ – విశాఖపట్నం ). అలీపుర్దూర్ (పశ్చిమ బెంగాల్) – పాన్వెల్ (ముంబయి) వయా పాట్నా – పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ – ప్రయాగ రాజ్ – జబల్ పూర్ – ఇటార్సి – భూసావల్. దిబ్రూఘర్ – గోమతి నగర్ (లక్నో), కామాఖ్య – రోహ్తక్ (హర్యానా), హౌరా – ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్), సీల్దా(కోల్కత్తా) – బనారస్ (వారణాసి), న్యూ జల్పాయిగురి – నాగర్‌కోయిల్ (వయా విశాఖపట్నం – విజయవాడ – గూడూరు) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభిస్తారు.
New Trains | ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలు
ఎస్.ఎం.వి.టి బెంగళూరు నుంచి బాలుర్ ఘాట్ (పశ్చిమ బెంగాల్ ) వీక్లీ ఎక్స్ ప్రెస్ వయా రేణిగుంట – గూడూరు – విజయవాడ – విశాఖపట్నం, ఎస్.ఎం.వి.టి బెంగళూరు –రాధికాపూర్ (పశ్చిమ బెంగాల్) వీక్లీ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభిస్తారు. ఈ రైలు రేణిగుంట – గూడూరు – విజయవాడ – విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ రైలును కామాఖ్య గౌహతి నుంచి హౌరా కోల్కత్త వరకు నడపనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాలకు ఎక్కువ రైళ్లను కేటాయించారు.