అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం చేశారు.
ప్రధాని (Prime Minister Narendra Modi) శౌర్యయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. శౌర్యయాత్రలో భాగంగా సోమనాథ్ ఆలయ విశిష్టత తెలిపే శకటాలు ఆకట్టుకున్నాయి. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సోమనాథ్ ఆలయాన్ని రక్షిస్తూ ప్రాణత్యాగం చేసిన వీరులను సత్కరించడానికి ‘శౌర్య యాత్ర’ (Shaurya Yatra) నిర్వహించారు. ఈ యాత్రలో శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 గుర్రాలతో కూడిన ఊరేగింపు జరిగింది.
PM Modi | ఘన స్వాగతం
యాత్ర మార్గంలో ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు మరియు భక్తులు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంపై నిలబడి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి మోదీ, ఒక కిలోమీటరు పొడవునా సాగిన ఈ యాత్రలో ప్రజలకు అభివాదం చేశారు. కాగా శనివారం వేలాది మంది భక్తులు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అక్కడే ఉన్నారు. కళ్లు చెదిరే బాణసంచా, అలంకరణలు, డ్రోన్ షోతో పాటు భక్తిభావం కలగలిసి ఆ పురాతన పుణ్యక్షేత్రానికి అపూర్వమైన జనసమూహాన్ని ఆకర్షించాయి. కాగా శనివారం సాయంత్రం మోదీ సోమనాథ్ ఆలయంలో ‘ఓంకార మంత్రం’ పఠనంలో పాల్గొన్నారు.