Kerala | పూజల పేరుతో మహిళను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala : పూజల పేరుతో మహిళను లైంగికంగా లోబర్చుకున్న ఘటన కేరళలో జరిగింది. బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళపై లైంగిక దాడికి పాల్పడడంతో కేరళ ఆలయ పూజారి సహాయకుడిని సోమవారం బెల్లందూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు త్రిస్సూర్‌లోని శ్రీ విష్ణుమయ స్వామి ఆలయంలో పూజారి సహాయకుడిగా పనిచేసిన అరుణ్ గా గుర్తించారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ మహిళ(38) జీవన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala : పూజల పేరుతో మహిళను లైంగికంగా లోబర్చుకున్న ఘటన కేరళలో జరిగింది. బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళపై లైంగిక దాడికి పాల్పడడంతో కేరళ ఆలయ పూజారి సహాయకుడిని సోమవారం బెల్లందూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు త్రిస్సూర్‌లోని శ్రీ విష్ణుమయ స్వామి ఆలయంలో పూజారి సహాయకుడిగా పనిచేసిన అరుణ్ గా గుర్తించారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ మహిళ(38) జీవన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కేరళలోని ఓ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లింది. అక్కడ పూజారి సహాయకుడు అరుణ్ ఆమెపై కన్నేశాడు. ఆమె కుటుంబంపై చేతబడి జరిగిందని, పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్మించాడు. పూజలు కఠినంగా ఉంటాయని ఆ మహిళను ఒప్పించాడు.

అనంతరం మహిళ ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి పూజలో పాల్గొనేలా చేశాడు. విపరీత భయానికి గురైన ఆ మహిళ పూజలు అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లిన మహిళను అరుణ్ మళ్లీ రావాలని బలవంతం చేశాడు. మహిళ బట్టలు లేకుండా పూజలో పాల్గొన్న వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు.

బాధితురాలు కేరళ వెళ్లాక ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వద్ద నుంచి డబ్బులు లాగేసుకుని, తాను ఎప్పుడు చెబితే అప్పుడు రావాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు బెంగళూరుకు చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.