అక్షరటుడే, వెబ్డెస్క్: Warangal | వరంగల్ జిల్లా (Warangal district) నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు నాడే ఓ మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందింది.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ (Narsampet town) కేంద్రంలో ప్రత్యూష అనే మహిళ నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. ఇంటి ఆవరణలో ఆరేసిన బట్టలు తీస్తుండగా విద్యుత్ షాక్ (electric shock) తగిలి మృతి చెందింది. షాక్కు గురైన మహిళను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయినా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కాగా పుట్టిన రోజు నాడే ప్రత్యూష చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
