అక్షరటుడే, బాన్సువాడ/బాల్కొండ: Sankranthi Festival | ఉమ్మడి జిల్లాలోని ఆయా పాఠశాలల్లో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి పండుగ (Sankranti festival) సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి.
Sankranthi Festival | బాన్సువాడలోని వాసవి హైస్కూల్‌లో..
బాన్సువాడ పట్టణంలోని వాసవి హైస్కూల్‌లో (Vasavi High School) విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల మైదానంలో విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత, సంప్రదాయాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లక్ష్మీశ్వేత, మేనేజ్మెంట్ సంధ్యారాణి, కరస్పాండెంట్ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Sankranthi Festival | బాల్కొండలో..
బాల్కొండ: యాంత్రిక జీవనశైలిలో మరుగున పడుతున్న పల్లె సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ బాల్కొండ మండల కేంద్రంలోని (Balkonda mandal) పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర, మదర్ థెరిసా హైస్కూళ్లలో విద్యార్థులు వేడుకలు జరిపారు.
Sankranthi Festival | బొమ్మరిల్లు.. హరిదాసు కీర్తనలు..
విద్యార్థుల ఆధ్వర్యంలో బొమ్మరిల్లు, హరిదాసు కీర్తనలు, పూరి గుడిసెల్లో పొంగలి తయారీ, గొబ్బెమ్మ ముగ్గులు అలరించాయి. పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు వంటి సంప్రదాయ కార్యక్రమాలతో పల్లె వాతావరణాన్ని విద్యార్థులు ఆవిష్కరించారు. సుమారు 120 మందికిపైగా చిన్నారులకు పాఠశాల కరస్పాండెంట్ కె.రామలక్ష్మి భోగి పళ్లు పోశారు. ఈ సందర్భంగా హెడ్‌మాస్టర్ కె.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతితో ముడిపడి ఉన్న మన పండుగలు, ఆచారాలు భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ హెడ్‌మాస్టర్ కె.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
