అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police village visit | నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో సోమవారం (నవంబరు 24) పోలీసులు విలేజ్ విజిటింగ్ కార్యక్రమం చేపట్టారు. సౌత్ సర్కిల్ CI ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా తగు జాగ్రత్తలు సూచించారు. సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలన్నారు.
Police village visit | సోషల్ మీడియాపై నిఘా..
ఎవరి వ్యక్తిగత విషయాలపై పోస్ట్‌లు చేయకుండా సిద్ధాంత పరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా మీద నిఘా ఉంటుంది, జాగ్రతగా వ్యవహరించాలని చెప్పారు.
ఎవరు కూడా భౌతికమైన దాడులకు దిగవద్దని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. CC camera ల ఉపయోగాలను గుర్తు చేస్తూ, గ్రామంలో CC కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
