Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పోలీసు సిబ్బందికి ప్రతిభా పతకాల అందజేత

Nizamabad City | పోలీసు సిబ్బందికి ప్రతిభా పతకాల అందజేత

కమిషనరేట్‌ పరిధిలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది సేవా పతకాలు సాధించారు. వారికి సీపీ సాయిచైతన్య పతకాలను అందించి, అభినందించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ సిబ్బందికి సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ప్రతిభా పతకాలను (Pratibha medals) అందజేశారు.

నిజామాబాద్‌ పోలీస్‌ శాఖలో (Nizamabad Police Department) పలువురికి ప్రభుత్వం పోలీస్‌ మహోన్నత సేవా పతకం, పోలీస్‌ ఉత్తమ సేవ, పోలీసు సేవా, అతి ఉత్కృష్ట సేవ, ఉత్కృష్ట సేవా విభాగాల్లో 95 పతకాలు సాధించారు. దీంతో మంగళవారం నగరంలోని కమిషనరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు పతకాలు పొందిన వారికి సీపీ అందజేశారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ సిబ్బందికి పతకాలు రావడంపై అభినందించారు. పతకాలు కేవలం గుర్తింపు కాదని, సేవా స్ఫూర్తికి, కష్టపడి పనిచేసే నిబద్ధతకు ప్రతీక అని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్‌) రాంచందర్‌ రావు, సిబ్బంది పాల్గొన్నారు.