అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | మాదకద్రవ్యాలు, గంజాయి (Marijuana) రవాణా నేపథ్యంలో ఆర్మూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్‌లో(Armoor Busstand) సోమవారం రాత్రి ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ(SHO Satyanarayana) ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
బస్టాండ్‌లోని ప్రయాణికుల సామగ్రిని డాగ్‌స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు. బస్టాండ్‌లో తిరుగుతున్న అనుమానిత వ్యక్తులను విచారించారు. ప్రజలకు సైతం పలు సూచనలు చేశారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు, గంజాయి అమ్ముతున్నట్లుగా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
