అక్షరటుడే, బోధన్: Local Body Elections | శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas) పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి గ్రామాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Local Body Elections | ప్రత్యేక నిఘా..
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎలాంటి భయభ్రాంతులకు లోనకాకుండా స్వేచ్ఛగా ప్రతిఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ఎలాంటి అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
