అక్షరటుడే, ఇందూరు: Andeshri | కవి, రచయిత డాక్టర్ అందెశ్రీ (Poet and writer Dr. Andesri) సంస్మరణ సభను మంగళవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయంలో (district library) నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి (Samskara Bharathi) ప్రతినిధులు, ఇందూరు కవులు, రచయితలు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ తన రచనల ద్వారా ఊపిరి పోశారని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి ప్రతినిధులు గంట్యాల ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కవులు వీపి చందన్ రావ్, గణపతి అశోక్ శర్మ, రమణాచారి, శారదా హన్మాండ్లు, కాసర్ల నరేష్ రావ్, సిర్ప లింగం, జనగామ చంద్రశేఖర శర్మ, రఘు, మాధురి, వరలక్ష్మి, జయప్రద, బెజుగం శ్రీకాంత్, జాగృతి తదితరులు పాల్గొన్నారు.
