అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Private Jet Crash | టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఓ విమానం కూలిపోయింది. రన్‌వే పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈఘటన ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్(Farrukhabad)లో గురువారం మధ్యాహ్నం ప్రైవేట్ జెట్ కూలిపోయింది. సాంకేతిక లోపంతో విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పైలెట్లు, ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. మొహమ్మదాబాద్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే బ్యాలెన్స్ కోల్పోయి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.
Private Jet Crash | నలుగురు సురక్షితం
విమానం కూలిపోయి చెట్లలో చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విమానం కూలిపోగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో జెట్‌లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై డీజీసీఏ దర్యాప్తు చేస్తోంది. కూలిపోయిన విమానం జెట్ సర్వీస్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినది. అధికారులు విమానాన్ని అక్కడి నుంచి తొలగించి రన్‌వేను క్లియర్ చేశారు. విమానం పొదల్లో కూలడం అదృష్టమని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా మేజిస్ట్రేట్ అశుతోష్ కుమార్ ద్వివేది పేర్కొన్నారు.