అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి రూ. 65 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో (Armoor Municipal office) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.
Mla Rakesh Reddy | అధికారులపై చర్యలు తీసుకుంటా..
బీటీ రోడ్లు, సీసీ డ్రెయినేజీల నిర్మాణంలో నాణ్యత లోపం కనిపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చిన నిధులతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిని పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడుతూ.. నకిలీ డాక్టర్లు తనిఖీలు చేస్తే ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. నకిలీ డాక్టర్ల మాయలో పడి నాణ్యత లోపంతో పనులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అనంతరం రైతు వేదికలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ శ్రావణి, అధికారులు ఉన్నారు.