Homeజిల్లాలునిజామాబాద్​CP Sai chaitanya | ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవాలి

CP Sai chaitanya | ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai chaitanya | ప్రజలు నిర్భయంగా.. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో (Police Commissioner’s Office) సోమవారం పోలీసు ప్రజావాణి (Police Prajavani) నిర్వహించారు. ఈ సందర్భంగా 27 ఫిర్యాదులను స్వీకరించారు. చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ల ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

CP Sai chaitanya | సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి సత్వరమే కృషి చేస్తామని.. ఫిర్యాదుదారులు నేరుగా తమను సంప్రదించవచ్చని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. పోలీసు సేవలను ప్రజలు నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Must Read
Related News