అక్షరటుడే, ఆర్మూర్: PDSU | విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పీడీఎస్యూ నాయకులు (PDSU leaders) ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో (Armoor town) మంగళవారం చోటు చేసుకుంది.
పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో (Alphores junior college) సెకండియర్ చదువుతున్న ఓ బాలుడిపై అదే కళాశాలకు చెందిన ఓ లెక్చరర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ మంగళవారం కళాశాల ఎదుట వారు ఆందోళనకు దిగారు.
కళాశాలల్లో బాలురకు కూడా రక్షణ లేని పరిస్థితి తయారైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రక్షణ కల్పించలేని కళాశాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, ప్రధాన కార్యదర్శి రాజు, ఏరియా నాయకులు వెంకట్, వివేక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు
