అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PDS Rice | నగర శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ (SHO Srinivas) వివరాలు వెల్లడించారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా నగర శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ లారీలో తరలిస్తున్న 28 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ షేక్ హుస్సేన్‌ను విచారించారు. కాగా.. తాను ఇమ్రాన్(బాల్కొండ), ఖలీల్(నిర్మల్), యూనిస్(నిర్మల్), తహర్(నిర్మల్) రెహ్మాన్(నిజామాబాద్) నుంచి సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్ వ్యాపారి హరికృష్ణ సూచన మేరకు మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా తెలిపాడు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
