అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Parineeti Chopra | బాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ జంటల పేర్లు చెప్పుకుంటే అందులో తప్పకుండా పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా జోడీ తప్పక ఉంటుంది. వీరి ప్రేమ, పెళ్లి చాలా ఆసక్తికరంగా సాగింది. ఇటీవల రాఘవన్‌ని తొలిసారి కలిసిన విషయం గురించి పరిణీతి చెప్పుకొచ్చింది. లండన్‌లో ఓ అవార్డ్ ఫంక్షన్ జరగగా, ఆ కార్యక్రమంలో వినోద రంగంలో సేవలు అందిస్తున్నందుకు పరిణీతిని (Parineeti Chopra) సన్నానించారు. మరోవైపు రాజకీయాలలో సేవలు అందిస్తున్నందుకు రాఘవన్‌ని సత్కరించారు. అయితే నా తమ్ముళ్లు రాఘవ్ చద్దాకు పెద్ద పొలిటికల్ ఫ్యాన్స్. వారు నాకు ఆ విషయం చెప్పడంతో నేను ‘హలో’ అంటూ రాఘవ్‌ను పలకరించాను, ఆ తర్వాత ఢిల్లీలో మళ్లీ కలుద్దామని చెప్పాను.
Parineeti Chopra | గుడ్ న్యూస్..
అయితే ఆ విషయం గుర్తుంచుకున్న రాఘవ్ మరుసటి రోజే నన్ను బ్రేక్ ఫాస్ట్‌కు ఆహ్వానించాడని పరిణీతి పేర్కొంది. ఆ తర్వాత సమయం చాలా స్పీడ్‌గా వెళ్లింది. మా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరగడం, 2023 సెప్టెంబర్ 24న మేము పెళ్లి చేసుకోవడం జరిగిందని పరిణీతి పేర్కొంది. ఇక తాజాగా ఈ జంట మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పుడు తాము ముగ్గురం కాబోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. బేబి ఆన్ ది వే (Baby on The Way) అంటూ పరిణీతి పోస్ట్ పెట్టగా, ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. 1+1=3 అనే బొమ్మతో కూడిన పోస్ట్ కింద మా చిన్న ప్రపంచం అంటూ పరిణీతి పేర్కొంది.
రాజస్థాన్ (Rajasthan) లోని ఉదయ్ పూర్ లో పరిణీతి – రాఘవ్‌ల వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం పరిణీతి, రాఘవ చాలా అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. వారి వివాహానికి అప్పటి సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, అశోక్ గెహ్లాట్, భగవంత్ మాన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వరుడి పక్షం తాజ్ ప్యాలెస్‌లో ఉండగా, వధువు కుటుంబం లీలా ప్యాలెస్‌లో ఉన్నారు. వరుడు పడవలో రాగా, మధ్యాహ్నం 2 గంటలకు బరాత్ జరిగింది, సాయంత్రం 4 గంటలకు పూజలు, 6 గంటల ప్రాంతంలో విదైర్ కార్యక్రమాలు జరిగాయి. సెప్టెంబర్ 24న వారి వివాహం జరిగింది.