అక్షరటుడే, కోటగిరి : Balayogi Krishna Maharaj | ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని అలాగే భగవంతుడిని స్మరిస్తూ భక్తిమార్గంలో నడవాలని మల్లారం గుట్ట (Mallaram Gutta) ఆశ్రమ వ్యవస్థాపకుడు బాలయోగి కృష్ణ మహరాజ్ సూచించారు. భక్తులకు సనాతన ధర్మం గురించి వివరించారు. పోతంగల్ మండల కేంద్రంలోని (Pothangal Mandal) సాయిబాబా కల్యాణ మండపంలో శుక్రవారం అయ్యప్ప స్వాముల ఇరుముడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన సనాతన ధర్మం గురించి భక్తులకు వివరించారు. శ్రీరాముడు తల్లిదండ్రుల మాట జవదాటకుండా 14 ఏళ్లు వనవాసం చేశారని, తల్లిదండ్రులను గౌరవించడం వల్ల శ్రీరాములు దేవుడయ్యారన్నారు. ప్రజలందరూ రాముడు సూచించిన ధర్మమార్గంలో నడవాలన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గురు స్వాములు రాధాకృష్ణ, సూదం శంకర్, విజయ్ పటేల్, సీతాల విజయ్ కుమార్, గంట్ల విఠల్, భక్తులు పాల్గొన్నారు.