అక్షరటుడే, వెబ్డెస్క్ : Sarpanch Reservations | పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు.
పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) కోసం ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల రిజర్వేషన్లు (Election Reservations) ఖరారు కావడంతో త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు, బీసీ డెడికేషన్ కమిషన్ (BC Dedication Commission) నివేదిక ఆధారంగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మిగతా 50శాతం జనరల్ కేటగిరికి కేటాయించారు.
ఎల్లారెడ్డి (Yellareddy)లో డివిజన్లో మొత్తం 144 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో వందశాతం గిరిజన జనాభా ఉన్న 21 గ్రామాల్లో ఎస్టీలకే అన్ని సీట్లు రిజర్వ్ చేశారు. మిగతా జీపీల్లో 9 ఎస్టీలకు, ఎస్సీలకు 19, బీసీలకు 32 సీట్లు కేటాయించారు. 63 స్థానాలు జనరల్ కేటాగిరిలో ఉన్నాయి.బాన్సువాడ డివిజన్లో 221 జీపీలు ఉన్నాయి. వందశాతం ఎస్టీలు ఉన్నా 19 జీపీలు ఉన్నాయి. అందులో వార్డు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ అవుతాయి. మిగతా జీపీల్లో 12 ఎస్టీలకు, 44 ఎస్సీలకు, బీసీలకు 52 సీట్లు కేటాయించారు. జనరల్ కేటాగిరిలో 104 సీట్లు ఉన్నాయి.కామారెడ్డి డివిజన్లో 167 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వందశాతం గిరిజనులు ఉన్న జీపీలు 25 ఉన్నాయి. మిగతా వాటిలో ఎస్టీలకు 4, ఎస్సీలకు 26, బీసీలకు 39, అన్ రిజర్వ్డ్ 73 స్థానాలు ఉన్నాయి.
Annexure III of kmr dist division wise
