అక్షరటుడే, హైదరాబాద్: Panchayat reservations | గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో విధివిధానాలు ఖరారయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రేపు (శనివారం, నవంబరు 22) GO జారీ చేయనుంది.
Panchayat reservations | 50% మించకుండా..
కాగా, రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
శనివారం జీవో జారీ అయ్యాక ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం ఎలక్షన్ ప్రక్రియ మొదలవుతుంది. నోటిఫికేషన్ జారీతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది.
