అక్షరటుడే, హైదరాబాద్: Panchayat elections | తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. సర్పంచి, వార్డు సభ్యల రిజర్వేషన్ల వివరాలను ఎలక్షన్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన గెజిట్ నివేదికను ఎన్నికల సంఘానికి సర్కారు అందజేసింది. సదరు వివరాలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించి, ఈసీకి సమర్పించింది.
Panchayat elections | ఓటర్ల జాబితా సవరణకు
కాగా, ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో విధివిధానాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ GO జారీ కూడా జారీ చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదించింది.
మరోవైపు పార్టీల వారీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆయా అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగానే పల్లెల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.
