Homeక్రీడలుPakistan A Vs Bangladesh A | సూపర్ ఓవర్ థ్రిల్లర్.. మూడోసారి టైటిల్ గెలుచుకున్న...

Pakistan A Vs Bangladesh A | సూపర్ ఓవర్ థ్రిల్లర్.. మూడోసారి టైటిల్ గెలుచుకున్న పాకిస్తాన్

Pakistan A Vs Bangladesh A | ఉత్కంఠభరిత ఫైనల్, డ్రామాటిక్ సూపర్ ఓవర్, యువ ఆటగాళ్ల ప్ర‌తిభ‌… ఈ ఫైనల్‌ను ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ చరిత్రలోనే గుర్తుండిపోయే మ్యాచ్‌గా నిలిపాయి.

- Advertisement -
అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan A Vs Bangladesh A | దోహాలో జరిగిన ఏసీసీ మెన్​ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ షాహీన్స్ అద్భుత విజయాన్ని సాధించింది.
వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ ఏతో Bangladesh A జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠ రేపింది. 20 ఓవర్లకు రెండు జట్లు సమాన స్కోర్‌ నమోదు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
పాకిస్తాన్ జట్టు ఒత్తిడిని అధిగమించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పాకిస్తాన్ షాహీన్స్ మూడోసారి (2019, 2023, 2025) ఈ టోర్నమెంట్‌ను కైవసం చేసుకుని హ్యాట్రిక్ టైటిళ్లు సాధించింది.
Pakistan A Vs Bangladesh A | కుప్పకూలిన పాక్ టాప్ ఆర్డర్

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. మొద‌ట్లోనే పాకిస్తాన్‌పై Pakistan ఒత్తిడి పెరిగింది. మ్యాచ్ తొలి బంతికే యాసిర్ ఖాన్ రనౌట్ కాగా, వెంటనే మొహమ్మద్ ఫైక్ డకౌట్ అవ్వడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవర్లలో కూడా పాక్ బ్యాటింగ్ నిలబడలేదు.

ఒక దశలో 73/5గా కష్టాల్లో ఉన్నప్పటికీ, సాద్ మసూద్ (38) మరియు అరాఫత్ మిన్హాస్ (25) కొంత పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత కూడా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో పాకిస్తాన్ 20 ఓవర్లు పూర్తికాకముందే 125 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ తరఫున రిపన్ మొండల్ 3 వికెట్లు, రకిబుల్ హసన్ 2 వికెట్లు తీశారు.

126 లక్ష్యంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభం బాగానే కనిపించినా, పాకిస్తాన్ బౌలర్స్ వరుస వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకొన్నారు. 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ పూర్తిగా ఒత్తిడిలో పడింది.

ఈ దశలో రకిబుల్ హసన్ (24), ఎస్ఎం మెహెరోబ్ (19) జట్టు అవకాశాలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. చివర్లో అబ్దుల్ గఫ్ఫార్ సక్లైన్ (నాటౌట్ 16), రిపన్ మొండల్ (నాటౌట్ 11) ధైర్యంగా ఆడటంతో మ్యాచ్ చివరి బంతి వరకూ సాగి ఉత్కంఠగా టై అయింది.

సూపర్ ఓవర్‌లో Super Over ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది. ఇక పాకిస్తాన్ తరపున సదాకత్, సాద్ మసూద్ జంట క్రీజ్‌లోకి వ‌చ్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా నాలుగో బంతికి మ్యాచ్ ముగించేసి పాకిస్తాన్ షాహీన్స్‌కు టైటిల్‌ను అందించారు.

ఈ విజయం ద్వారా పాకిస్తాన్ షాహీన్స్ 2019, 2023 తర్వాత 2025లో కూడా ట్రోఫీ గెలుచుకుని హ్యాట్రిక్ టైటిళ్లను నమోదు చేసింది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ యువ ఆటగాళ్లు చూపిన జోష్, మ్యాచ్ పరిస్థితులను అద్భుతంగా అర్థం చేసుకొని పోరాడిన తీరు ప్రశంసలు పొందుతోంది.