Mana Shankar Varaprasad gaaru review | నటీనటులు : చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ థెరిసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సుదేవ్ నైర్, మాస్టర్ రేవంత్, ఇతరులు
దర్శకుడు : అనిల్ రావిపూడి
నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
సంగీతం : భీమ్ సిసిరోలియో
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంక్రాంతికి స్టార్ హీరోల సందడి మాములుగా లేదు. ఇప్పటికే ప్రభాస్ ప్రేక్షకులని రాజా సాబ్ చిత్రంతో అలరించగా, ఇప్పుడు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu) మూవీతో ప్రేక్షకులని పలకరించారు. చిరు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.
Mana Shankar Varaprasad gaaru review| కథ:
ఈ సినిమా కథను రెండు ముక్కల్లో చెప్పాలంటే చాలా సింపుల్. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకరవరప్రసాద్ (చిరంజీవి) తన విధి నిర్వహణలో భాగంగా కలిసిన అత్యంత విజయవంతమైన బిజినెస్ ఉమెన్ శశిరేఖ (నయనతార)పై తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఆ ఆకర్షణ ఆమెకూ కలగడంతో మాటలు ఎక్కువ లేకుండానే వారి బంధం ప్రేమగా మారి, అతి తక్కువ సమయంలోనే పెళ్లి వరకు చేరుతుంది.
కానీ, ఈ ఆనందం ఎక్కువకాలం నిలవదు. తన సంపద, స్థానం అన్నీ వదిలేసి ప్రసాద్‌తో కలిసి జీవించేందుకు శశిరేఖ నిర్ణయించుకోవడం ఆమె తండ్రి జీవీకే (సచిన్ ఖేడేకర్)కి అగ్నిపరీక్షగా మారుతుంది. కోపం, అహంకారం, కుట్రలతో అల్లుడు–కూతురిని విడదీసి చివరకు డైవర్స్ వరకు తీసుకెళ్తాడు. ఫలితంగా ప్రసాద్ తన ఇద్దరు పిల్లలకి ఆరేళ్లపాటు దూరమవుతాడు.
అయితే అక్కడితో కథ ముగియదు. పిల్లల జీవితంలోకి తిరిగి ప్రవేశించేందుకు ప్రసాద్ చేసే ప్రయత్నాలు, మళ్లీ శశిరేఖను కలుసుకుని తన కుటుంబాన్ని ఒక్కటిగా చేయాలనే పోరాటమే మిగతా కథ. ఈ ప్రయాణంలో వెంకీ గౌడ (వెంకటేష్) పాత్ర ఏమిటి? శశిరేఖను, ఆమె పిల్లలను లక్ష్యంగా చేసుకున్న శత్రువులు ఎవరు? ఈ కుటుంబ కథ చివరకు ఎలా సుఖాంతమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపై తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్:
నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చిరంజీవి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ఇందులో వింటేజ్ మెగాస్టార్‌ను మరోసారి చూడొచ్చు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. చిరంజీవి ఈ సినిమాలో తనని తాను మరో లెవల్లో ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. డాన్సుల్లో కనిపించే గ్రేస్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ర్యాప్ సాంగ్‌లో ఆయన చేసిన హంగామా ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తుంది. 156 సినిమాల కెరీర్లో ఇంత ఫ్రీగా, ఓపెన్‌గా నటించడం ఇదే తొలిసారి అనిపిస్తుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవిలోని అన్ని యాంగిల్స్‌ను పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. కామెడీ, డాన్స్, యాక్షన్, సెంటిమెంట్—అన్నీ సహజంగా కుదిరాయి. చిరంజీవి కూడా అంతే నేచురల్‌గా అవన్నీ చేసి చూపించడంతో సినిమా వేరే స్థాయికి వెళ్లింది. నయనతార గ్లామర్, ఆమె యాటిట్యూడ్ సినిమాకు మరో ప్లస్. చిరంజీవి భార్య శశిరేఖగా డామినేటింగ్ రోల్లో ఆమె అదరగొట్టింది. క్లైమాక్స్‌లో వెంకటేష్ ఇచ్చిన ఎంట్రీ స్పెషల్ హైలైట్. ఆయన, చిరంజీవి మధ్య వచ్చే ఎపిసోడ్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కు అది ఫుల్ మీల్స్‌లా పనిచేస్తుంది.
బుల్లిరాజు మరోసారి తన మార్క్ చూపించాడు. పిల్లల నటన కూడా చాలా బాగా కుదిరింది. కేంద్ర మంత్రిగా శరత్ సక్సేనా స్క్రీన్‌పై ఉన్నంతసేపు ఆకట్టుకుంటాడు. హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడ్కర్ తన పాత్రకు యాప్ట్‌గా ఒదిగిపోయి నవ్వులు పూయించాడు. చిరంజీవి టీమ్‌గా అభినవ్ గోమటం, కేథరిన్ థ్రేస్సా, విష్ణు వర్ధన్ తమ తమ కామెడీతో ఎంటర్టైన్ చేశారు. మిగిలిన పాత్రలు కూడా కథకు తగ్గట్టు ఓకే అనిపిస్తాయి.
టెక్నికల్ పర్ఫార్మెన్స్
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్‌గా కనిపిస్తాయి. కథకు అవసరమైన సెట్స్, ప్రొడక్షన్ డిజైన్‌ను చక్కగా ప్లాన్ చేశారు. భీమ్స్ సంగీతం సినిమాకు మంచి బలంగా నిలిచింది. ఆయన తన మార్క్ ఫోక్ టచ్‌తో కొన్ని పాటలను స్పెషల్‌గా నిలబెట్టగా, పాటలన్నీ ఇప్పటికే హిట్‌గా మారాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. కీలక సన్నివేశాలను తన స్కోర్‌తో బాగా ఎలివేట్ చేశాడు. కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా ఓవరాల్‌గా బాగానే కుదిరింది. అయితే సెకండాఫ్‌లో కొంచెం ఇంకా కేర్ తీసుంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫైట్ సీక్వెన్స్‌లను స్టైలిష్‌గా ప్లాన్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్‌పై తీసిన టేకింగ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి పనితనానికి వస్తే—గత సినిమాలతో పోలిస్తే ఈసారి ఆయన వర్క్ మరింత బెటర్‌గా అనిపిస్తుంది. కథను పక్కన పెట్టినా, కథనాన్ని మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సీక్వెన్స్‌లను డిజైన్ చేయడంలో ఆయన విజయం సాధించాడు. ముఖ్యంగా ఆయన గత సినిమాలపై వచ్చిన ‘క్రింజ్’ అనే విమర్శలకు ఇందులో పెద్దగా తావు ఇవ్వలేదు. ఆ విషయంలో అనిల్ ఈ సినిమాతో సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని రూపొందించిన సన్నివేశాలు, డైలాగ్స్ వారికి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇందులో రైటింగ్ టీమ్ చేసిన ఎఫర్ట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులను కేవలం కామెడీ యాంగిల్లోనే కాకుండా, అవి ఎలా సర్దుకుపోవచ్చో కూడా డీసెంట్‌గా చూపించారు. దీనికి తోడు కావాల్సినంత వినోదాన్ని జోడించడం ఈ సినిమాకు అదనపు బోనస్‌గా నిలిచింది.
ప్లస్ పాయింట్స్:
- బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్
- ఇంటర్వెల్ యాక్షన్ సీన్
- చిరు పర్ఫార్మెన్స్
- అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్
- రొటీన్ సీన్స్
విశ్లేషణ:
మొత్తంగా చూస్తే పండుగ కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచని ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్లకు వచ్చిన ప్రతి వర్గం ఆడియెన్స్‌ను హ్యాపీగా పంపేలా సినిమా సాగుతుంది. హిలేరియస్‌గా నడిచే సాలిడ్ కామెడీ ఎపిసోడ్స్ ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వులు పూయిస్తాయి. మెగాస్టార్ నుంచి అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే వెంకీ మామ ఎపిసోడ్స్ అయితే ఆడియెన్స్‌కు బోనస్‌లా మారాయి. చిరంజీవి–వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు నిజంగా ఒక ట్రీట్. వీటన్నింటికీ తోడు దర్శకుడు అనిల్ రావిపూడి పని చాలా బ్యాలెన్స్‌గా ఉండటం సినిమాకు ప్లస్ అయ్యింది.
కామెడీతో పాటు అందమైన ఎమోషన్స్‌ను కూడా మేళవించి రూపొందించిన ఈ చిత్రాన్ని పండుగ వాతావరణంలో థియేటర్లలో చూసి ఫుల్‌గా ఎంటర్టైన్ కావచ్చు.
రేటింగ్: 3.25/ 5