అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కామారెడ్డి రక్తదాతల సమూహం (Kamareddy Blood Donors Group) ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఉత్తమ రక్తదాన శిబిరాల (blood donation camps) పురస్కారాన్ని ఎల్లారెడ్డి మున్సిపల్ ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు షేక్ గయాజుద్దీన్కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
Yellareddy | సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని..
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని రక్తదానం లాంటి మహత్తర కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం ప్రశంసనీయమని శ్రీనివాస్ గుప్తా అన్నారు. ముఖ్యంగా యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్న ఆయన తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరింత ఉత్తమ సేవలు అందిస్తూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. సామాజిక సేవా రంగంలో ఆయన చేస్తున్న కృషికి ఈ పురస్కారం ఒక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ మీర్, ముకర్రం, జాయింట్ సెక్రెటరీ అహ్మద్ పాషా సభ్యులు మహబూబ్, ముజాహిద్ పాల్గొన్నారు.