అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch elections) బీసీలపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క సంతోషి విమర్శించారు. ఈమేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (panchayat elections) రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, జీవో నం.46 ప్రకారం 50శాతం రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు.
ఇందులో ఎస్సీ, ఎస్టీల పంచాయతీలు యథాతథంగా ఉండగా, బీసీలకు 22శాతం రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 22 శాతం ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత న్యాయం కల్పించకుంటే బీసీ రాజ్యాధికార పార్టీ (BC Rajyadhikari Party) పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్ధపడతామని స్పష్టం చేశారు.
1 comment
[…] వారు మాట్లాడుతూ.. కామారెడ్డి (Kamareddy)లో త్వరలో జరిగే ఈ మహాసభలో కేంద్ర, […]
Comments are closed.