Homeటెక్నాలజీOne Plus | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ ఫోన్‌.. ధర ఎంతంటే..

One Plus | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ ఫోన్‌.. ధర ఎంతంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :One Plus | చైనా(China)కు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ అయిన వన్‌ ప్లస్‌ అద్భుతమైన డిజైన్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌తో మరో మోడల్‌ ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈనెల 8వ తేదీన భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5(OnePlus Nord CE5) ని విడుదల చేయనుంది. 12వ తేదీ మధ్యాహ్నం నుంచి అమెజాన్‌(Amazon)తోపాటు వన్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌లో సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటించనప్పటికీ లీకైన సమాచారం మేరకు ఈ మోడల్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉండే అవకాశాలున్నాయి.

డిస్‌ప్లే:6.77 ఇంచ్‌ ఫుల్‌ హెచ్డీ + అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ఐపీ 54 రేటింగ్‌ వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌తో వస్తోంది.
ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ కలిగి ఉంది.

ప్రాసెసర్‌:మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అపెక్స్‌ చిప్‌సెట్‌(4nm, ఆక్టాకోర్‌), మాలి-జీ615 జీపీయూ అమర్చారు. గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం LPDDR5X రామ్‌, యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజీ ఉంది.

సాఫ్ట్‌వేర్‌:ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టం. ఏఐ ఆధారిత ఫీచర్లున్నాయి.

కెమెరా:వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌ సోనీ ఎల్‌వైటీ 600 మెయిన్‌ కెమెరా(OIS సపోర్ట్‌)తో పాటు 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ కెమెరాతో కూడిన డ్యూయల్‌ కెమెరా సెట్‌ అప్‌, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగా పిక్సెల్‌ సెన్సార్‌తో వస్తోంది.

బ్యాటరీ:7100 mAh బ్యాటరీ. 80 w SuperVOOC ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌. 59 నిమిషాలలో 100 శాతం చార్జింగ్‌ అయ్యే అవకాశాలున్నాయి. బ్యాటరీ లైఫ్‌ను పొడిగించడానికి ఇంటెలిజెంట్‌ చార్జింగ్‌ మేనేజ్‌మెంట్‌ను ఉపయోగించారు.

కలర్స్‌:బ్లూ వాయిడ్‌, చార్‌కోల్‌ ఇంక్‌, సిల్వర్‌ రే.

వేరియంట్లు:6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23 వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.
8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25 వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.
12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Read all the Latest News on Aksharatoday.in