Homeజిల్లాలునిజామాబాద్​Drunk drive | డ్రంకన్ ​డ్రైవ్​లో పట్టుబడిన ఒకరికి జైలుశిక్ష

Drunk drive | డ్రంకన్ ​డ్రైవ్​లో పట్టుబడిన ఒకరికి జైలుశిక్ష

డ్రంకన్​డ్రైవ్​లో తనిఖీల్లో పట్టుబడిన ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పినిచ్చింది. ఇందుకు సంబంధిచిన వివరాలను ఐదో టౌన్​ ఎస్​హెచ్​వో గంగాధర్​ వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పినిచ్చింది. ఐదో టౌన్​ ఎస్​హెచ్​వో గంగాధర్​ (SHO Gangadhar) వెల్లడించిన వివరాల మేరకు.. నగరంలోని ఐదో టౌన్​ పరిధిలో తనిఖీలు చేస్తుండగా సోమవారం రాత్రి వర్ని చౌరస్తా వద్ద దారుగల్లీకి చెందిన షేక్​ సుల్తాన్​ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించారు.

అనంతరం అతడికి కౌన్సెలింగ్​ నిర్వహించి సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి ఏడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్​హెచ్​వో తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Drunk drive | ఆర్మూర్​లో ముగ్గురికి రూ.30వేల జరిమానా

అక్షరటుడే, ఆర్మూర్: Drunk drive | పట్టణంలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టినట్లు ఎస్​హెచ్​వో సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ముగ్గురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించి వారిని ఆర్మూర్​ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. విచారించిన కోర్టు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందని ఆయన వివరించారు.