120
అక్షరటుడే, కోటగిరి: Pothangal | కుక్కను తప్పించబోయి ఓ వ్యక్తి రోడ్డుపై పడి మృతి చెందాడు. ఈ ఘటన పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో (Pothangal village) శుక్రవారం చోటుచేసుకుంది.
ఎస్సై సునీల్ (Sub-Inspector Sunil) తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ మండలం సలాబత్పూర్ గ్రామానికి చెందిన షేక్ ఖాసిం (42) కూరగాయలు కొనడానికి పోతంగల్కు వస్తుండగా కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించబోయిన ఖాసిం రోడ్డుపై పడిపోయాడు. దీంతో స్పందించిన స్థానికులు అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఆయన కుటుంబీకురాలు షేక్ హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.