Homeజిల్లాలుకామారెడ్డిNasrullabad | జీవితంపై విరక్తితో వృద్ధుని బలవన్మరణం

Nasrullabad | జీవితంపై విరక్తితో వృద్ధుని బలవన్మరణం

జీవితంపై విరక్తితో వృద్ధుడు చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్​ మండలంలో బుధవారం చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | జీవితంపై విరక్తితో వృద్ధుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్​ మండలంలో (Nasrullabad mandal) చోటుచేసుకుంది.

ఎస్సై రాఘవేందర్ (Sub-Inspector Raghavendra) తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్​ మండలం నెమ్లి గ్రామానికి చెందిన చిట్టి వీరయ్య (72) కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. అలాగే కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోవడం.. ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది నెమ్లి అటవీప్రాంతంలో (Nemli forest area) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.