అక్షరటుడే, వెబ్‌డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ వెలువడింది. 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (Police Recruitment Board) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
APP Notification | వీరు అర్హులు
మొత్తం 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీజోన్–1లో 50 పోస్టులు, మల్టీ జోన్–2లో 68 పోస్టులు ఉన్నాయి. లా చదివిన మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అలాగే రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. 2025 జులై 1 నాటికి 34 ఏళ్లు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
APP Notification | వేతనం ఎంతంటే..
ఏపీపీ పోస్టుకు ఎంపికైతే భారీగా వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టుకు సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం ఇస్తారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి పేపర్ ఆబ్జెక్టివ్ టైప్‌లో, రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం https://www.tgprb.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.