అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేసులు పెడితే భయపడమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటీవల ఢిల్లీ పోలీసులు వారిపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం స్పందించారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మంగళవారం కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు. నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబం అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, ఆస్తులు ధారపోశారని చెప్పారు. స్వతంత్రం రావడంలో నేషనల్ హెరాల్డ్ (National Herald Case) పత్రికది ప్రముఖపాత్ర అని చెప్పారు.
CM Revanth Reddy | 7న ఓయూకు వెళ్తా
డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. ఉద్దండులను అందించిన ఓయూను కేసీఆర్ కాలగర్భంలో కలిపారని విమర్శించారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని, ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పారు. సంక్షోభం, అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలను తరలిస్తామని సీఎం తెలిపారు.
CM Revanth Reddy | డీసీసీలది కీలక పాత్ర
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) డీసీసీలదే కీలక పాత్ర అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీలందరూ అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. ఏఐసీసీ పరిశీలికుల చేత డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగిందన్నారు. రెండేళ్ల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయని వెల్లడించారు. తప్పకుండా నాయకుల పనికి తగ్గ గుర్తింపు దక్కుతుందని హామీ ఇచ్చారు.
