HomeUncategorizedNational Herald case | కాంగ్రెస్​కు షాక్.. సోనియా, రాహుల్​కు కోర్టు నోటీసులు

National Herald case | కాంగ్రెస్​కు షాక్.. సోనియా, రాహుల్​కు కోర్టు నోటీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: National Herald case | కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో మనీ లాండరింగ్(Money Laundering) వ్యవహారంలో ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌(National Herald) పత్రిక వ్యవహారంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ED) దాఖలు చేసిన కేసులో వీరిద్దరికీ కోర్టు ఈ నోటీసులు పంపింది. ఈడీ ఛార్జిషీట్​కు సమాధానం ఇవ్వాలని కోర్టు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీకి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్ విచారణ సమయంలో ప్రతివాదుల వాదనలు వింటామని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు.

National Herald case | ఈడీ సూచన మేరకు..

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అక్రమాలు జరిగాయని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2014లో దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు స్వీకరించింది. ఆ తర్వాత ఈ కేసులో 2021లో ఈడీ దర్యాప్తు అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. విచారణ జరిపిన ఈడీ.. ఇటీవల ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే, కొత్త చట్టం ప్రకారం నేషనల్ హెరాల్డ్​కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్​ను పరిగణనలోకి తీసుకోలేమని.. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. గతవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జిషీట్​లో సరైన పత్రాలు లేని కారణంగా సోనియా, రాహుల్​కు నోటీసులు ఇచ్చేందుకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. తాజాగా శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.