Heavy Rains | ఆగని వర్షాలు.. రైతుల ఇబ్బందులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం rain కురిసింది. అరేబియా సముద్రం Arabian Seaలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం Rainy season ప్రారంభం కాకముందే జోరు వానలు పడుతుండడంతో వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల్లోకి అప్పుడే నీరు రావడం మొదలైంది. Heavy Rains | […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం rain కురిసింది. అరేబియా సముద్రం Arabian Seaలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం Rainy season ప్రారంభం కాకముందే జోరు వానలు పడుతుండడంతో వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల్లోకి అప్పుడే నీరు రావడం మొదలైంది.

Heavy Rains | వర్షపాతం వివరాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా నార్నూర్​లో 127.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్​ జిల్లా ధర్పల్లిలో 101.3 మి.మీ., జగిత్యాల 88, జగిత్యాల జిల్లా మేడిపల్లి 86.5, ఆదిలాబాద్​ జిల్లా తాళ్లమడుగు 82.3, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ 79.3, ఆదిలాబాద్​ జిల్లా పిప్పాయిదారిలో 78.8, నిజామాబాద్​ జిల్లా సిరికొండలో 70.8, కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్​లో 64.8 మి.మీ. వర్షం కురిసింది.

Heavy Rains | ముందుగానే వానాకాలం

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు Southwest monsoon చురుగ్గా కదులుతున్నాయి. దీంతో వానాకాలం ముందుగానే ప్రారంభం కానుంది. జూన్​ మొదటి వారంలో తెలంగాణ telangnaలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రుతుపవనాలు రాకముందే అల్ప పీడనం ప్రభావంతో భారీ వర్షాలతో ప్రస్తుతం వానాకాలాన్ని తలపిస్తోంది.

Heavy Rains | నేడు కూడా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరోవైపు శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన పడే ఛాన్స్​ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Heavy Rains | తడిసిపోతున్న ధాన్యం

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ paddy ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరింది. అయితే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వర్షానికి బస్తాల్లోని ధాన్యం తడిసి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ధాన్యం ఆరబోయడం ఎలా అని.. ఒకవేళ ఆరబోద్దాం అనుకున్నా నిత్యం వానపోడుతోందని వాపోతున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.