54
అక్షరటుడే, బాన్సువాడ: Nizamsagar | నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు కోసం ప్రాజెక్టు (Nizamsagar Project) నుంచి నీటి విడుదలను సోమవారం ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 8.30 గంటలకు అధికారులు నీటిని విడుదల చేశారు.
Nizamsagar | ప్రధాన కాలువకు 700 క్యూసెక్కులు
ప్రధాన కాలువకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ (Project AEE Saketh) తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.253 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలలో హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. కాలువ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.