Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

Nizamabad Collector | ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

రాష్ట్రంలో మ‌హిళా సంఘాల‌కు రూ.304 కోట్ల వ‌డ్డీలేని రుణాలు ప్ర‌భుత్వం అంద‌జేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. భిక్కనూరులో మంగళవారం మండల కేంద్రంలోని ఎస్సీ గార్డెన్​లో మహిలకు రుణాలను అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో మంగళవారం డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల కోడ్ (election code) అమల్లోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్​లు, పోస్టర్లను, ప్రభుత్వ గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. నిఘా బృందాలను నియమించాలని, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను నిరోధించాలని, మద్యం, డబ్బు, వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు.

బ్యాలెట్ బాక్సులు (Ballot boxes), ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా సరిచూసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వేషన్ల జాబితాను పరిశీలించుకోవాలని తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్వాన్​ మాల్వియా, జడ్పీ సీఈవో సాయా గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.