అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nashik Bus Accident | మహారాష్ట్రలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ Nashik జిల్లా సిన్నార్ బస్టాండులో ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.
ఈ దారుణ ఘటనలో తొమ్మిదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
డ్రైవరు బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nashik Bus Accident | నియంత్రణ కోల్పోయి..
బస్టాండులో ఉదయం 10:45 గంటల సమయంలో బస్సు సిన్నార్ నుంచి దేవ్‌పూర్ బయలుదేరేందుకు ప్లాట్‌ఫామ్‌పై వద్దకు తీసుకొస్తుండగా.. నియంత్రణ కోల్పోయి, ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది.
