అక్షరటుడే, ఇందూరు: Nizamabad DCC president | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నగేశ్ రెడ్డి (Nagesh Reddy) నియమితులయ్యారు. అలాగే నిజామాబాద్ నగరాధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
డీసీసీ, నగరాధ్యక్షుడి నియామకం కోసం అక్టోబర్‌లో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. పదవులకు చాలా మంది దరఖాస్తు చేసుకోగా.. పార్టీ వీరిద్దరి వైపు మొగ్గు చూపింది. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నగేశ్ రెడ్డి పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. పీసీసీ కార్యదర్శి, ప్రధానకార్యదర్శి కొనసాగారు. ఆయన గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ (Nizamabad Market Committee) ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
Nizamabad DCC president | డీసీసీ పదవికి దరఖాస్తు చేసుకుంది వీరే..
జిల్లా అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నాయకులు దరఖాస్తులు అందజేశారు. ఇందులో నిజామాబాద్‌కు చెందిన నరాల రత్నాకర్, చంద్ర శేఖర్ గౌడ్, సాయికుమార్, ఎం.సాయిరెడ్డి, ముజ్జు పటేల్, ఇమ్మడి గోపి, జగడం సుమన్, మహమ్మద్ జనీద్ అక్రమ్, ఎంఏ.హలీం ఉన్నారు. అలాగే ఆర్మూర్‌కు చెందిన నేత అయ్యప్ప శ్రీనివాస్, బాల్కొండ నుంచి వేణుగోపాల్ యాదవ్ సైతం దరఖాస్తు ఇచ్చారు.
Nizamabad DCC president | నగర అధ్యక్ష పదవికి..
ఇక నగర అధ్యక్ష పదవికి సైతం పలువురు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో నరాల రత్నాకర్, గతంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన గన్‌రాజ్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామర్తి గోపి, అంతిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, పంచరెడ్డి చరణ్, అలాగే బొబ్బిలి రామకృష్ణ, కౌడిపు శరత్, మహమ్మద్ కైసర్, మహమ్మద్ జనీద్ అక్రమ్ తమ దరఖాస్తులను అందజేశారు. అయితే అధిష్టానం బొబ్బిలి రామకృష్ణకు పదవిని ఇచ్చింది.
