అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | స్టేషన్ రైటర్లు (Station writers) క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో (Kamareddy SP Office) గురువారం వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న రైటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
SP Rajesh Chandra | బాధ్యతతో వ్యవహరించాలి..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైటర్లు స్టేషన్లలో బాధ్యతతో వ్యవహరించాలన్నారు. విధులు, బాధ్యతలు, రికార్డ్ నిర్వహణ, వృత్తి నైపుణ్యాలపై ఎస్పీ రాజేష్ చంద్ర పలు సూచనలు అందజేశారు. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తప్పులు లేకుండా డాక్యుమెంట్లు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
