Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad collector | ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి

Nizamabad collector | ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి

Nizamabad collector | స్థానిక సంస్థల ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పోలింగ్​ నిర్వహించాలని నిజామాబాద్​ కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి అన్నారు. పోలింగ్​లో ఆర్వోలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Nizamabad collector | ఎన్నికల విధులు, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు జరిగేలా పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్​లో​ శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి వివాదాలకు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలు పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఆర్​వోలు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటనను అనుసరిస్తూ ఆర్వోలు నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఆరోజు నుంచి ప్రాదేశిక నియోజకవర్గం నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలన్నారు. అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలని చెప్పారు.

Nizamabad collector | బ్యాలెట్​ పేపర్​లో తెలుగు అక్షర క్రమంలో..

బ్యాలెట్ పేపర్​లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమ ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని కలెక్టర్​ వివరించారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి.. ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి.. అందుకు గల కారణాలు తదితర అంశాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఆర్వో, ఏఆర్వోల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు జెడ్పీ సీఈవో కార్యాలయంలో (CEO Office) హెల్ప్​డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్​డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయాలని వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఏ దశలోనూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, డిప్యూటీ సీఈవో సాయన్న, డీఈవో అశోక్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.