అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కాంగ్రెస్ నాయకుడు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.. (Gaddam Chandrasekhar Reddy) కార్యకర్తలు, కార్మికుల కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే తోచిన సహాయం అందజేస్తూ మన్ననలు పొందుతున్నారు.
తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు షేక్ మహబూబ్ కూతురి పెళ్లికి చేయూత అందించారు. వారి కుటుంబానికి పెళ్లి కానుకగా (wedding gift) రూ. 40 వేలు అందజేశారు. దాంతో ఆ కార్మికుడు చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, సాయిబాబా, మున్సిపల్ యూనియన్ లీడర్ ప్రభాకర్, ఆనంద్, ప్రభు, జ్యోతి, దీవెన తదితరులు పాల్గొన్నారు.
