అక్షరటుడే, ఇందల్వాయి: Mountaineer Poorna | పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణను గురువారం ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్క (Minister in-charge Dhanasari Seethakka) పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి దేవిదాస్ మరణించారు.
ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఇన్ఛార్జి మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా అండగా ఉంటానని హామీనిచ్చారు. ఇన్ఛార్జి మంత్రితోపాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి (Rural MLA Dr. Bhupathi Reddy), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.
