అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Moradabad District)లో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం పుట్టిస్తోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ తల్లి ప్రసవానంతరం తన 15 రోజుల పసిబిడ్డను పొరపాటుగా ఫ్రీజర్‌లో ఉంచింది.
ఈ ఘటన అందరు ఉలిక్కిపడేలా చేసింది. వివరాలలోకి వెళితే శుక్రవారం రాత్రి బిడ్డను నిద్రపుచ్చిన తల్లి ఆ శిశువును తీసుకు వెళ్లి ఫ్రీజర్(Freezer)లో పెట్టి నిద్రపోయింది. అయితే కొంతసేపటికి శిశువు ఆ చలిని తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాడు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఇల్లంతా వెతికారు. చివరికి రిఫ్రిజిరేటర్(Refrigerator)లో అపస్మారక స్థితిలో ఉన్న శిశువును గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Uttar Pradesh | కాస్త లేట్ అయితే..
అక్కడ వైద్యులు చిన్నారి ప్రాణాలకు ప్రమాదం లేదని ధ్రువీకరించారు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉండగా, తల్లిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, సదరు మహిళ ప్రసవానంతరం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్(Postpartum Depression)తో బాధపడుతున్నట్లు తెలిసింది. మానసిక స్థితి సహజ స్థాయిలో లేకపోవడంతో ఆమె ఇటువంటి అనూహ్య చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రసవానంతరం మహిళల్లో సుమారు 70 శాతం మందికి తాత్కాలిక మానసిక ఒత్తిడి (బేబీ బ్లూస్) కనిపించడం సహజం. దీన్ని తేలికగా తీసుకోకుండా, దీర్ఘకాలం కొనసాగితే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ ఘటన, ప్రసవానంతర మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. తల్లులకు శారీరంగానే కాదు, మానసికంగా కూడా ఉండాలి. ప్రసవానంతరం చాలా మంది మహిళల్లో తాత్కాలిక మానసిక ఒత్తిడి కనిపించడం సహజం. ఇది బేబీ బ్లూస్(Baby Blues) లేదా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గా పిలుస్తారు. సాధారణ లక్షణాలు దిగులు, భయం, చిరాకు, నిద్రలేమి, ఏడవడం, ఒంటరితనం భావన. ఇది తీవ్రమైతే తప్పుదోవ పట్టే నిర్ణయాలు తీసుకునే ప్రమాదం. దీనికి చికిత్స తీసుకోకపోతే దీని ప్రభావం తల్లి, శిశువు ఇద్దరిపైనా తీవ్రంగా పడే అవకాశం ఉంది. అందుకే, దీని తీవ్రతను తగు చికిత్స తీసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.