Homeఆంధప్రదేశ్Mosquito repellent incense sticks | విచ్చల విడిగా నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్...

Mosquito repellent incense sticks | విచ్చల విడిగా నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ వాడకం.. ముందంజలో తెలుగు రాష్ట్రాలు.. ఆందోళన కలిగిస్తున్న సర్వేలు!

నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్​కు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా తెలుగు రాష్ట్రాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీటి వల్ల తీవ్రమైన ప్రజారోగ్య ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Mosquito repellent incense sticks | నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్​కు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అవతరించాయి. వీటి వల్ల తీవ్రమైన ప్రజారోగ్య ముప్పు తలెత్తుతోంది.

ఇళ్లలో పురుగు మందుల సురక్షితమైన వాడకాన్ని ప్రోత్సహించే ది హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (హికా) వంటి సంస్థలతో పాటు, చట్టబద్ధమైన రీతిలో దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్​ (ధూపం కర్రల) అందించే కంపెనీలు.. ఈ నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ విషయంలో హెచ్చరిస్తున్నాయి.

Mosquito repellent incense sticks | రూ.1,800 కోట్లకు పైగానే..

భారత్​లో ఈ నకిలీ ధూపం కర్రల మార్కెట్ విలువ రూ. 1,800 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇందులో దక్షిణ భారతదేశపు వాటా రూ. 370 కోట్ల వరకు ఉంటుందంటున్నారు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోనే సుమారు రూ. 100 కోట్ల వరకు ఈ నకిలీ వ్యాపారం ఉంటుందంటున్నారు. అంటే, సురక్షితం కాని ప్రాంతాల్లో మన రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయన్నమాట.

“మూలికా (హెర్బల్) ” లేదా “సహజమైన (నేచురల్)”గా మార్కెట్ చేయబడే నకిలీ దోమల ఇన్సెన్స్ స్టిక్స్ తరచుగా ఆమోదించబడని రసాయనాలను కలిగి ఉంటాయి. ఎక్కువ సేపు వీటి నుంచి వెలువడే రసాయనాలను పీల్చటం వల్ల శ్వాస కోశ సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులలో ఇది మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ఈ నకిలీ దోమల స్టిక్స్ ను స్థానిక దుకాణాలు, జనరల్ షాపులు, ఫార్మసీలలో కూడా రూ. 10–15 మధ్య ధరలకు విక్రయిస్తారు.

వ్యవసాయం – రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డు & రిజిస్ట్రేషన్ కమిటీ (CIB&RC), భారతదేశంలో దోమల నివారణ మందులలో వాడటానికి వినియోగించే రసాయనాలను ఆమోదించే అధికారం కలిగి వుంది.

దోమల నివారణ మందులలో వాడటానికి ఉద్దేశించిన ఏదైనా రసాయనాన్ని అయినా దేశంలో తయారు చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి లేదా విక్రయించడానికి ముందు CIBRCలో నమోదు చేసుకోవాలి.

ప్రభుత్వ CIBRC-ఆమోదించిన దోమల నివారణ మందులు ప్యాకేజింగ్‌పై పేర్కొనబడిన CIR (సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ రిజిస్ట్రేషన్)ను కలిగి ఉంటాయి. ఇది ఉత్పత్తి యొక్క ప్రామాణికత, భద్రతకు హామీ ఇస్తుంది.

ఈ నకిలీ దోమల స్టిక్స్ (CIB&RC) కు ఆమోదం లేదు. ఈ నకిలీ స్టిక్స్​పై రిజిస్ట్రేషన్ నంబర్‌ ఉండదు. నాణ్యత, భద్రతకు ఎటువంటి జవాబుదారీతనం లేకుండా తయారు చేయబడతాయి.

పెరుగుతున్న ఈ ముప్పుపై ఆరోగ్య ఆందోళనలను లేవనెత్తిన, బాంబే హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ముఖేష్ సంక్లేచా ఈ విధంగా వివరిస్తున్నారు.

“నియంత్రించబడని ఇన్సెన్స్ స్టిక్స్ వంటి పొగ ఆధారిత రెపెల్లెంట్​ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇవి తరచుగా చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్న, ఆమోదించబడని రసాయనాలతో తయారు చేయబడతాయి. ఇవి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. వీటికి బదులుగా.. భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి CIBRC-ఆమోదించబడిన విశ్వసనీయ బ్రాండ్ల రిపెల్లెంట్స్​ను ఎంచుకోండి..” అని అన్నారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధికారులతో దగ్గరగా పనిచేసే లాభాపేక్షలేని సంస్థ అయిన హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (హికా), నకిలీ ఇన్సెన్స్ స్టిక్స్ తయారీదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది.

2018 – 24 మధ్య, హికా దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర ఉత్పత్తుల ఉత్పత్తిదారులు, టోకు వ్యాపారులు, అమ్మకందారులపై నిర్వహించిన 100 కంటే ఎక్కువ దాడులకు మద్దతు ఇచ్చింది.

ఈ నకిలీలపై ప్రజలలో అవగాహన కూడా కల్పిస్తోంది. భద్రతా సమ్మతిని ప్రోత్సహిస్తోంది. హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (హికా) గౌరవ కార్యదర్శి జయంత్ దేశ్‌పాండే మాట్లాడుతూ..

మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ముప్పు నిరంతరం పెరుగుతున్నందున వాటి నివారణ చాలా ముఖ్యం. అయితే, ఒక ప్రధాన క్లిష్టమైన ఆందోళన ఏమిటంటే, చట్టవిరుద్ధమైన నకిలీ దోమల రిపెల్లెంట్​ ఇన్సెన్స్ స్టిక్స్ యొక్క విచ్చలవిడి ఉపయోగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇళ్లలో ఎక్కువగా ఉంది.

నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ స్లీప్‌వెల్, ఐటెక్స్, హంటింగ్ టైగర్, సుబనిత్ర వంటి సందేహాస్పద పేర్లతో అమ్ముడవుతాయి. CIBRC ఆమోదించని అక్రమ రసాయనాలను కలిగి ఉంటాయి.

ఏదైనా దోమల వికర్షకం భద్రత, సమర్థత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి 3 సంవత్సరాల పాటు కఠినమైన పరీక్షలను ఎదుర్కోవటం తప్పనిసరి. ఈ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఏ విధంగానూ హాని జరగదని నిర్ధారించిన ఉత్పత్తులు ప్రజలకు మనశ్శాంతిని అందిస్తాయి.

చిత్తశుద్ధి లేని సంస్థలు తయారు చేసే ఈ నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ ప్రభుత్వం నియంత్రించే తయారీ ప్రక్రియల రూపంలో ఉత్పత్తి కావు.. అని వివరించారు.

జయంత్ దేశ్‌పాండే మరింతగా చెబుతూ.. “తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరించాయి. ఈ నకిలీ రిపెల్లెంట్ చట్టపరమైన, ఆర్థిక ప్రక్రియలకు అనుగుణంగా ఉండవు.

వీటి వల్ల పన్ను ఎగవేత కూడా జరుగుతుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి, ప్రజలు ప్యాకేజింగ్‌పై ముద్రించిన రిజిస్ట్రేషన్ నంబర్ (CIR తో ప్రారంభమయ్యే) ఉన్న ప్రభుత్వం ఆమోదించిన దోమల రిపెల్లెంట్స్​ను మాత్రమే ఉపయోగించాలి.

రిజిస్ట్రేషన్ నంబర్ (CIR నంబర్) తర్వాత ప్రభుత్వం ఆమోదించిన సంవత్సరం పేర్కొనబడుతుంది. ఇది ఉత్పత్తి యొక్క ప్రామాణికత, భద్రతకు హామీ ఇస్తుంది” అని అన్నారు.

గుడ్‌నైట్‌ బ్రాండ్​తో తమ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ అయిన గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జిసిపిఎల్) ఉత్పత్తి & కేటగిరీ డైరెక్షన్ హెడ్ రోహిత్ వెంగుర్లేకర్ మాట్లాడుతూ..

“నియంత్రణ లేని, సురక్షితం కాని, ఆమోదించబడని రసాయనాలను ఉపయోగించి తయారు చేయబడిన నకిలీ దోమల రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ వినియోగం పెరగడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. దోమల  రిపెల్లెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ లో అగ్రగామిగా, జీసీపీఎల్​ ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందుతోంది.

జీసీపీఎల్ వద్ద, కుటుంబాలను రక్షించడానికి, సురక్షితమైన, విశ్వసనీయమైన, శాస్త్రీయ మద్దతుగల ఎంపికల కోసం ప్రచారం చేయటానికి గుడ్‌నైట్ కట్టుబడి ఉంది. మా గుడ్‌నైట్ దోమల రిపెల్లెంట్ ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉంటాయి.

ఆమోదించబడిన క్రియాశీల పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడతాయి. భద్రత, సామర్థ్యం కోసం పరీక్షించబడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. CIR నంబర్‌తో ధృవీకరించబడిన, ప్రభుత్వ-ఆమోదించబడిన ఉత్పత్తులను మాత్రమే వాడాలి..” అని అన్నారు.

ఆమోదించబడని దోమల రిపెల్లెంట్ ఉత్పత్తుల వాడకం తీవ్రమైన అనారోగ్య ప్రమాదాన్ని కలిగించడమే కాకుండా.. డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులపై భారత్​ చేస్తున్న పోరాటాన్ని కూడా దెబ్బతీస్తుంది.